

నేడు ఇంటర్నెట్‌లో పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో పాటు సెలబ్రిటీలు, పలువురు ప్రముఖులకు స్వంత వెబ్‌సైట్ లు ఉన్నాయి. ఈ వెబ్‌సైట్‌లలో వ్యక్తిగత సమాచారంతో పాటు సంస్థల కార్యకలాపాలకు సంబంధించిన వివరాలు తదితరాలను పొందుపరుస్తున్నా రు. ఇక నేడు ఎవరైనా సరే సులభంగా నెట్‌లో తమ సొంత వెబ్‌సైట్‌ను ప్రారంభించుకునే అవకాశం ఉండడం విశేషం. చాలా తక్కువ ఖర్చుతో నెట్ లో తమ వెబ్‌సైట్‌ను ఏర్పాటుచేసుకోవడం ఎంతో సులభంగా మారింది.

సృజనాత్మకమైన వెబ్ డిజైనింగ్...


వెబ్ డెవలపింగ్‌లో నేడు యానిమేషన్, ఆథరింగ్, కమ్యూనికేషన్ డిజైన్, కార్పోరేట్ ఐడెంటిటీ, గ్రాఫిక్ డిజైన్, హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్, ఇన్‌ఫర్మేషన్ ఆర్కిటెక్చర్, ఇంటరాక్షన్ డిజైన్, మార్కెటింగ్, ఫొటోగ్రఫీ, సెర్చ్ ఇంజైన్ ఆప్టిమైజేషన్, టైపోగ్రఫీ వంటి వాటిని వినియోగిస్తున్నారు. వెబ్‌డి జైనింగ్‌లో హెచ్‌టిఎంఎల్, ఎక్స్‌హెచ్ టిఎంఎల్, ఎక్స్‌ఎంఎల్ వంటి మార్క్‌అప్ లాంగ్వేజెస్, సిఎస్‌ఎస్, ఎక్స్‌ఎస్‌ఎల్ వంటి స్టైల్ షీట్ లాంగ్వేజెస్, జావా స్క్రిప్ట్ వంటి క్లైంట్ సైడ్ స్క్రిప్టింగ్, పిహెచ్‌పి, ఎఎస్‌పి వంటి సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్, మైైఎస్ క్యూఎల్, పోస్ట్‌గ్రేఎస్ క్యూఎల్ వంటి డాటాబేస్ టెక్నాలజీస్, ఫ్లాష్, సిల్వర్ లైట్ వంటి మల్టీమీడియా టెక్నాలజీస్‌ను వినియోగిస్తూ సైట్ పేజీలను రూపొందిస్తున్నారు. ఇక వెబ్ డిజైనింగ్ గురించి మొదట తెలియజేసింది టిమ్ బెర్నెర్స్‌లీ. ఆయన 1991 ఆగస్టులో వెబ్ డిజైనింగ్ గురించి ఓ పుస్తకాన్ని రాశారు. ఆయన ఇంటర్నెట్, వెబ్‌సైట్‌లు, సైట్‌ల డిజైనింగ్ తదితరాల గురించి ఇందులో వివరించారు.
వెబ్‌సైట్ డొమైన్ నేమ్...


www.godaddy.com లోకి వెళ్లి అందులో కొత్తగా ఎవరైనా వెబ్‌సైట్ డొమైన్ నేమ్‌ను క్రియేట్‌చేసుకునే సౌకర్యం ఉండడం విశేషం. ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలకు అనుగుణంగా వివిధ మొత్తాలను చెల్లించి వెబ్‌సైట్ డొమైన్ నేమ్‌ను కొనుగోలుచేయవచ్చు. ఇందుకుగాను 600రూ.ల నుంచి రెండు,మూడు వేల రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇక ఇంటర్నెట్‌లో స్పేస్‌ను కొనుగోలుచేసేందుకు వెబ్ హోస్టింగ్‌సెంటర్లను సంప్రదించాల్సి ఉంటుంది. సైట్‌లోని వివిధ పేజీలను ఏర్పాటుచేసుకునేందుకు ఈ స్పేస్ అవసరమవుతుంది. ఇందులో 1 జిబి, 2 జిబిలు మొదలుకొని అన్‌లిమిటెడ్ స్పేస్ నేడు నెట్‌లో అందుబాటులో ఉంది. ఇందుకుగాను వేయి రూపాయల నుంచి ఆరు వేల రూపాయల వరకు ఖర్చవుతుంది. ఈ స్పేస్ కొనుగోలు అనంతరం వెబ్‌డిజైనర్లు, వెబ్ డెవలపర్లు కలిసి వెబ్‌సైట్‌ను డెవలప్ చేస్తారు. వెబ్‌సైట్‌లోని పేజీలను వెబ్ డిజైనర్ రూపొందిస్తూ ఆ పేజీలకు సంబంధించిన ప్రోగ్రామ్, కోడింగ్, అప్లికేషన్స్ వంటి వాటిని వెబ్ డెవలపర్ రూపొందిస్తాడు. వెబ్ డిజైనర్లు, డెవలపర్లు సమిష్టిగా పనిచేస్తూ వెబ్‌సైట్‌లోని పేజీలలో సమాచారం, ఫొటోలను రోజు మార్చడం, ఫ్లాష్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తూ ప్రత్యేక సమాచారం, అడ్వర్టైజ్‌మెంట్లను రూపొందించడం వంటివి నిర్వహిస్తారు.

సొంతంగా వెబ్‌సైట్...
ఇంటర్నెట్‌లో వెబ్‌సైట్ క్రియేట్ చేసుకోవడం నేడు చాలా సులభంగా మారింది. ముందుగా డొమైన్ నేమ్ రిజిస్ట్రేషన్ చేసిన అనంతరం నెట్‌లో స్పేస్ కొనుగోలుచేస్తే చాలు సైట్ ప్రారంభమైనట్టే. వివిధ సంస్థలు, వ్యక్తులు వెబ్‌సైట్‌లో అవసరమైన మేరకు పేజీలను రూపొందించాలని చెబితే దాని ప్రకారం వెబ్ డిజైనింగ్, డెవలపింగ్ కొనసాగుతుంది. నేడు అందుబాటులో ఉన్న హెచ్‌టిఎంఎల్, ఎక్స్‌హెచ్‌టిఎంఎల్, ఎక్స్‌ఎంఎల్ వంటి మార్క్‌అప్ లాంగ్వేజెస్, సిఎస్‌ఎస్, ఎక్స్‌ఎస్‌ఎల్ వంటి స్టైల్ షీట్ లాంగ్వేజెస్, జావా స్క్రిప్ట్ వంటి క్లైంట్ సైడ్ స్క్రిప్టింగ్, పిహెచ్‌పి, ఎఎస్‌పి వంటి సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్, మైఎస్‌క్యూఎల్, పోస్ట్‌గ్రేఎస్‌క్యూఎల్ వంటి డాటాబేస్ టెక్నాలజీస్, ఫ్లాష్ , సిల్వర్‌లైట్ వంటి మల్టీమీడియా టెక్నాలజీస్‌ను వినియోగిస్తూ వెబ్‌సైట్‌ను పూర్తిగా డెవలప్ చేయడం జరుగుతుంది. నేడు పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో పాటు పలువురు వ్యక్తులు సొంతంగా వెబ్‌సైట్‌లను రూపొందించుకునేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు.
- శివకుమార్, వెబ్ డెవలపర్.
No comments:
Post a Comment